ఓటు వేసి.. పోలింగ్‌ కేంద్రం వద్ద కుప్పకూలిన వృద్ధుడు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) అక్కడే కుప్పకూలి మృతి చెందారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బుచ్చయ్య కుమార్తె రాములమ్మ అదే వార్డులో పోటీలో ఉండటంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్