కోడి కాళ్లు విరగ్గొట్టారని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వృద్దురాలు (వీడియో)

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గంగమ్మ అనే వృద్ధురాలికి చెందిన కోడి పొరుగువారి గడ్డివాములో గింజలు తింటుందనే కారణంతో రాకేష్ అనే వ్యక్తి కోడిని కర్రతో కొట్టి కాళ్లు విరగ్గొట్టాడు. తీవ్ర ఆవేదనకు గురైన గంగమ్మ స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి న్యాయం కోరింది. తన కోడిని ఇలా హింసించడమే కాకుండా ప్రాణహాని కలిగించిన రాకేష్‌కు తగిన శిక్ష వేయాలంటూ ఆమె వాపోయింది.

సంబంధిత పోస్ట్