పార్లమెంట్‌లో మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాలని స్పీకర్‌ను కోరనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సంఖ్యా బలమే కీలకం. 543 స్థానాలున్న లోక్‌సభలో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 249 సీట్లు ఉన్నాయి. ఇతర పార్టీల వద్ద 11 సీట్లు ఉన్నాయి.