పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో హింసాకాండ చెలరేగింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. హౌరా జిల్లాలో బీజేపీ కార్యకర్త జాదవ్ బార్, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ కార్యకర్త అబీర్ షేక్ హత్యకు గురయ్యారు. జాదవ్ బార్‌ను టీఎంసీ కార్యకర్తలు, అబీర్ షేక్‌ను బీజేపీ మద్దతుదారులు హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి. జల్పాయ్‌గురిలో టీఎంసీ అభ్యర్థి కృష్ణదాస్ బీజేపీ మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.