ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు ఉన్నాయి. అయితే మార్కెట్‌లోకి జెలియో-ఇ మొబిలిటీ (ZELIO) తన ఈవా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్ రూ. 50 వేలుకే విడుదల చేసింది. ఫేస్ లిస్ట్ మోడల్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది.