ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్‌ సరఫరా!

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జులై 1 నుంచి ఆక్వా చెరువులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులకు ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో రైతు సంఘం నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్