ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన ఆలయం వద్ద భక్తులపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో ఐదుగురు భక్తులు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు ఆలయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడుకు చెందిన వారని సమాచారం.