కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని అంచేపాళ్య సమీపంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 5.30 గంటలకు మార్నింగ్ వాక్‌కు వెళ్లిన నాగరాజు (60)పై దారి తప్పి వచ్చిన ఏనుగు దాడి చేసింది. బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి అంచేపాళ్య వైపు వచ్చిన ఏనుగు తొండంతో దాడి చేయడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అదే దారిలో ఏనుగు తిరిగి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మృతుడి కుటుంబానికి కర్ణాటక ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది. ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.