కోయంబత్తూరు జిల్లా వాల్పరై సమీపంలో సోమవారం తెల్లవారుజామున తోటలో నివాసం ఉంటున్న 55 ఏళ్ల అస్లా, ఆమె మూడేళ్ల మనవరాలు హేమశ్రీలపై అడవి ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో అధికారులు ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. అడవి జంతువుల సంచారం పెరుగుతున్నందున రాత్రి వేళల్లో జాగ్రత్తలు పాటించాలని అటవీ అధికారులు సూచించారు.