డోర్‌ క్లోజ్‌ అవ్వకుండానే పైకెళ్లిన లిఫ్ట్‌.. వ్యక్తికి గాయాలు (వీడియో)

గుజరాత్‌లోని వల్సాద్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. పైఅంతస్తులో లిఫ్ట్ ఎక్కిన వ్యక్తి, గ్రౌండ్ ఫ్లోర్‌లో డోర్ తెరుచుకోగానే దిగేందుకు ప్రయత్నించాడు. అయితే, డోర్లు మూసుకునేలోపే లిఫ్ట్ వేగంగా పైకి వెళ్లడంతో ఆ వ్యక్తి బయటకు జారి కిందపడ్డాడు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. లిఫ్ట్ సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్