ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనత సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. స్పేస్‌ఎక్స్ విలువ భారీగా పెరగడంతో మస్క్ నికర ఆస్తుల విలువ ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ట్రిలియనీర్ హోదా సాధించిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీల్లోని వాటాలు ఆయన సంపదకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. ప్రైవేట్ అంతరిక్ష రంగం, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో కీలక పాత్ర పోషించిన మస్క్ వ్యాపార ప్రపంచంలో మరో మైలురాయిని చేరుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్