ట్రంప్, మోదీల చర్చలో ఎలాన్ మస్క్.. అంతర్జాతీయంగా చర్చ

పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పాల్గొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇరువురు నేతలు మాట్లాడుతుండగా మస్క్ కాల్‌లో చేరారు. ఈ చర్చల్లో హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన అవసరం, భారత నౌకల భద్రత వంటి అంశాలపై చర్చించారు. మస్క్ ఎందుకు పాల్గొన్నారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఇది సాంకేతిక సహకారాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్