వినూత్న ఆవిష్కరణలతో ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్లను అబ్బుపరుస్తున్నాయి. ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా (Tesla) సంస్థ 'ఫ్లయింగ్ టెస్లా (Flying Tesla)' కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్స్టర్ మోడల్లో ఈ ఎగిరే కారును తీసుకొచ్చింది. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను మస్క్ తన ఎక్స్ ఖాతాలో, టెస్లా సంస్థ కూడా విడుదల చేసింది. ఇది ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.