టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపారు ఎలాన్ మస్క్. స్టార్‌లింక్ బ్రాండెడ్ ఫోన్ వస్తే అద్భుతంగా ఉంటుందన్న ఓ యూజర్ కామెంట్‌కు 'అసాధ్యం కాదు' అని మస్క్ స్పందించడంతో, ఆయన స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఫోన్ గరిష్ట పనితీరు (Performance per Watt) పై దృష్టి పెట్టి, అధునాతన AI అప్లికేషన్లు, న్యూరల్ కంప్యూటింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో టెస్లా ఫోన్ రూమర్లు వైరల్ అయినా, మస్క్ అప్పట్లో అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. అయితే, స్టార్‌లింక్ ఫోన్ వాస్తవంగా వస్తే, అది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త అధ్యాయాన్ని తెరవవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.