అనారోగ్య కారణాలతో ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్(69) శుక్రవారం కన్నుమూశారు. దేబ్రాయ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్) ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులు, ఆర్థికవేత్తలు, వ్యాపారులు సంతాపం వ్యక్తం చేశారు. గత సెప్టెంబరులో పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఛాన్సలర్ పదవికి దేబ్రాయ్ రాజీనామా చేశారు.