చెన్నై నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం తిరిగి చెన్నైలో ల్యాండింగ్ అయింది. దుబాయ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ గగనతలం మూసివేశారు. దీంతో చెన్నై నుండి బయలుదేరిన 4 గంటల తర్వాత మళ్లీ అదే ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. ఈ మేరకు విమానంలో ఉన్న 30 మంది భారతీయులు, 7 మంది విదేశీయుల ప్రయాణం రద్దు చేశారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు సూచించారు.