మేనేజర్‌ను కసితీరా పొడిచి పొడిచి చంపిన ఉద్యోగి.. వీడియో

అమెరికాలోని మిచిగన్‌లో మహిళా ఉద్యోగి తన మేనేజర్‌ను కత్తితో 15సార్లు పొడిచి హత్య చేసింది. మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్న 26 ఏళ్ల అఫెని ముహమ్మద్, మానసిక వేధింపులు తట్టుకోలేక మేనేజర్ జెన్నిఫర్ హ్యారిస్‌పై దాడి చేసింది. ఘటనకు ముందు రోజే అఫెని తన సోషల్ మీడియా ఖాతాల్లో 'నా మేనేజర్ నన్ను ఎంతగా అవమానిస్తున్నారో మీకు తెలుసా.. ఇక తట్టుకోలేను' అంటూ పోస్టు చేసింది. ఈ ఘటనతో ఉద్యోగ స్థలంలో ఒత్తిడి ఎంత ప్రమాదకరమో మరోసారి బయటపడింది.

సంబంధిత పోస్ట్