గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు పాదయాత్ర చేపట్టిన అనంత్ అంబానీ దానిని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ మాట్లాడుతూ.. అనంత్ ఈ దివ్య ద్వారకాధీశుడి వద్దకు పాదయాత్ర పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. గత 10 రోజులుగా అనంత్ పాదయాత్రలో పాల్గొన్న యువకులందరూ మన సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. అనంత్‌కి బలాన్ని ప్రసాదించమని ద్వారకాధీశుడిని ప్రార్థిస్తున్నాను.