గిరిజన యువతకు 'గిరి దర్శక్'తో ఉపాధి

TG: పర్యాటక అభివృద్ధి, గిరిజన యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “గిరి దర్శక్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపికైన 20 మంది గిరిజన యువకులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో వీరు సేవలు అందించనున్నారు. శిక్షణ పొందిన ఈ యువత పర్యాటకులకు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరించడమే కాకుండా, అటవీ నియమాలు, భద్రతను పర్యవేక్షిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్