జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ కొనసాగిస్తున్నాయి. తాజాగా కుల్గాం జిల్లా అకల్ దేవ్‌సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాదులు కాల్పులు జరపగా, వారు భద్రతా బలగాల ట్రాప్‌లో చిక్కుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.