పశ్చిమ బెంగాల్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రహ్లాద్ దాస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు అతడిని తీసుకెళ్లగా, నిందితుడు పోలీసుల గన్ లాక్కుని కాల్పులు జరుపుతూ పరారీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రహ్లాద్ దాస్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు ప్రకటించారు.