భారత సముద్ర జలాల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించిన కోస్టగార్డ్ నౌక ICGS సావిత్రిబాయి ఫూలే సేవల నుంచి రిటైర్ అయ్యింది. కర్ణాటకలోని కార్వార్ పోర్టులో నౌక డీ-కమిషనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2006లో సేవల్లోకి వచ్చిన ఈ నౌక ఇప్పటివరకు 14 సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, 4 మెడికల్ ఎవాక్యుయేషన్ మిషన్లు చేపట్టింది. సముద్రంలో ఆపదలో చిక్కుకున్న మత్స్యకారులు, వాణిజ్య నౌకల సిబ్బందిని రక్షించడంలో కీలకంగా సేవలందించింది.