ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి జారెడ్ కుష్నర్ తెలిపారు. సోమవారం కీవ్‌లో చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్య ఎంత క్లిష్టమైనదైనా, పరిష్కరించాల్సిన అవసరం ఉంటే పూర్తి శక్తితో ప్రయత్నించాలని ట్రంప్ చెబుతుంటారని అన్నారు. యుద్ధం, మరణాలకు ముగింపు పలికి.. కుటుంబాలకు ఉపశమనం కల్పించడమే ట్రంప్ లక్ష్యమని కుష్నర్ పేర్కొన్నారు.