అమెరికాతో చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ఏడు షరతులను వాషింగ్టన్‌కు పంపినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించడం, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, అమెరికా నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం వంటి డిమాండ్లను ఆయన వెల్లడించారు. అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, తమ షరతులు అంగీకరించకపోతే సైనికంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రెజాయీ హెచ్చరించారు.