లార్డ్స్ వేదికగా మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసిన ఇంగ్లండ్.. రెండో టెస్టులో 192 పరుగులే చేసింది. రూట్ (40) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు అందరూ స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, సిరాజ్ 2, బుమ్రా 2, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు. కాగా టీమిండియా విజయ లక్ష్యం 193 పరుగులు.