లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ ఇంగ్లండ్ ఒక్క ఓవర్ మాత్రమే బ్యాటింగ్ చేసింది. జాక్ క్రాలీ(2), బెన్ డకెట్ (7) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. తొలి ఓవర్ సిరాజ్ బౌలింగ్ వేస్తున్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 387 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కూడా 387 పరుగులే చేసింది. మొత్తంగా ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 13/0.