ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు కొనసాగుతోంది. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు తీసిన భారత్.. రెండో సెషన్‌లో రూట్(40), స్మిత్(8)ను పెవిలియన్‌కు పంపింది. కాగా ఆ రెండు వికెట్లు వాషింగ్టన్ సుందర్ తీయడం విశేషం. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్ (27), క్రిస్ వోక్స్ (8) ఉన్నారు. కాగా సిరాజ్ 2, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు.