అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ బ్రైడన్ కార్స్ హాఫ్ సెంచరీ సాధించారు. బ్రైడన్ కార్స్ 77 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. సిరాజ్ వేసిన 110వ ఓవర్లో రెండో బంతికి సిక్స్ కొట్టి బ్రైడన్ కార్స్ అర్ధశతకం అందుకున్నారు. టెస్ట్ కెరీర్‌లో బ్రైడన్‌కు ఇది మొదటి అర్ధశతకం. దీంతో 111 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 382/9గా ఉంది.
Credits: ECB, IG