ENG VS IND: లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్ 109/1

ఇంగ్లండ్-భారత్ మధ్య ఆఖరి టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టపోయి 109 పరుగులు చేసింది. బెన్ డకెట్(43) ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలీ(52), ఓలీ పోప్(12) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 115 పరుగులు వెనకంజలో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 224 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్