లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా 4 వికెట్లు నష్టపోయి 248 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (98) సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరోవైపు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోన్న రిషభ్ పంత్ 74 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బషీర్ బౌలింగ్‌లో సింగిల్ కోసం ప్రయత్నించిన పంత్‌ను బెన్‌స్టోక్స్ రనౌట్ చేశాడు.