రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఆ జట్టు బ్యాటర్లలో జెమీ స్మిత్ (184*), బ్రూక్ (158) సెంచరీలతో రాణించారు. ఇరువురు కలిసి ఆరో వికెట్‌కు ఏకంగా 303 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్ ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీశారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 డకౌట్లు నమోదయ్యాయి.