ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ప్లేయర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోగా పాదానికి తగిలింది. దీంతో నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ప్రత్యేక వాహనంపై బయటికి తీసుకెళ్లారు. పంత్ 37 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడటంతో క్రీజులోకి రవీంద్ర జడేజా (5) వచ్చాడు. మరోవైపు క్రీజులో సాయి సుదర్శన్(54) కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 224/3.