ENG vs IND: టీమిండియాకు షాక్.. పంత్ ఔట్ (వీడియో)

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ చివరి రోజు ఆట ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడుతున్న పంత్‌ను ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 75/5. టీమిండియా విజయానికి ఇంకా 118 పరుగులు అవసరం. కాగా, క్రీజులో కేఎల్‌ రాహుల్‌ 39, జడేజా 1 ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్