ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ ఆఖరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌటైంది. రెండో రోజు ఆట ప్రారంభించిన కాసేపటికే 224 పరుగులకు పది వికెట్లు కోల్పోయింది. గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో కీపర్ జెమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణ(0) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. కరుణ్ నాయర్(57) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అట్కిన్సన్ 5 వికెట్లు తీయగా.. జోష్ 3, వోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.