కేరళలో నిశ్చితార్థం జరిగిన రెండు నెలలకే ఓ జంట అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. కాసరగోడ్‌కు చెందిన అనుశ్రీ (25), ఇరిట్టీకి చెందిన అమల్ (26) ఎస్‌బీఐ ఉద్యోగులు. డిసెంబర్ 26న వీరి వివాహం జరగాల్సి ఉంది. బుధవారం అనుశ్రీ ఇంట్లో మృతిచెందగా, విషయం తెలుసుకున్న అమల్ ఎర్నాకులంలోని ఓ లాడ్జిలో గది తీసుకుని అక్కడ మృతిచెందారు. పోలీసులు ఇద్దరి మొబైల్ ఫోన్లను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట ఇలా మరణించడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.