విశాఖపట్నం నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో సుమారు 160 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ప్రయాణికులలో కలకలం రేపింది.