ఓయూలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విజ్ఞాన్‌ అనే విద్యార్థి ఆక్సిజన్ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుజూరాబాద్‌కు చెందిన విజ్ఞాన్‌ ఓయూ హాస్టల్‌లో ఉంటున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్