హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినికి మత్తు మందు ఇచ్చి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాదిగా తన కూతురికి మత్తు చాక్లెట్లు, టాబ్లెట్లు ఇచ్చి కాలేజ్, హోటల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశిష్ అతని స్నేహితుడు ప్రవీణ్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. శనివారం విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.