ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2027 కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. భారత సంతతికి చెందిన ప్రార్థనా రెడ్డి, శ్రిష్టి పాటిల్కు చోటు దక్కింది. నేపాల్, బంగ్లాదేశ్ వేదికలుగా 2027 జనవరి-ఫిబ్రవరిలో టోర్నీ జరగనుంది. జట్టులో మారియా ఆండ్రూస్, అమెలీ బిషప్, ఫోబే బ్రెట్, ఎలిజా బ్రిస్టోవ్, ఫ్లోరా డేవిస్, హాలీ గార్టన్, బ్రియోని గిల్గ్రాస్, జెనెవీవ్ జీర్, అమెలియా ఒలివర్, ఫైత్ టీకాసింగ్, క్లారా ఠాకర్, స్కై థామస్, వీనస్ వీరప్పులి ఉన్నారు.