వైభవ్ సూర్యవంశీని ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ సిద్ధం: హ్యారీ బ్రూక్

భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశంపై ఆసక్తి నెలకొంది. అయితే, వైభవ్‌ను ఎదుర్కొనేందుకు తమ జట్టు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వెల్లడించాడు. 'మా వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ ఆడితే, అతడిని సులభంగా ఎదుర్కొనేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేశాం' అని బ్రూక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ 230కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

సంబంధిత పోస్ట్