అరుదైన రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్ రూట్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనతను సాధించారు. ఈ మ్యాచ్‌లో 62 పరుగులు చేయడం ద్వారా తన వన్డే కెరీర్‌లో 50 హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. తద్వారా ఈ మైలురాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు 189 ఇన్నింగ్సుల్లో 20 సెంచరీలు, 8,089 పరుగులతో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ 80, రోహిత్ 63 హాఫ్ సెంచరీలతో టాప్‌లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕