ప్రైవేట్ రంగ ఉద్యోగులకు EPF పథకం ద్వారా ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. ఈపీఎఫ్ ఖాతా యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2.5 లక్షల నుండి రూ.7 లక్షల వరకు పరిహారం అందుతుంది. మరణానికి ముందు 12 నెలల సగటు పీఎఫ్ మొత్తాన్ని లేదా సగటు నెలవారీ జీతం 35 రెట్లు, సగటు జీతంలో సగం కలిపి బీమా పరిహారం లెక్కిస్తారు. చాలా మంది EPF సభ్యులకు రూ. 7 లక్షల బీమా కవరేజ్ ఉంటుంది.