ఏప్రిల్ 1న తెరుచుకోనున్న కేరళలోని ఎరవికులం జాతీయ పార్కు

కేరళలోని ఎరవికులం జాతీయ పార్కును ఏప్రిల్ 1 నుండి సందర్శకుల కోసం తిరిగి తెరవనున్నారు. అయితే నీలగిరి తహర్ల సంతానోత్పత్తి కాలం కారణంగా రెండు నెలల పాటు అధికారులు మూసి ఉంచారు. ఈ పార్కు అంతరించిపోతున్న 'నీలగిరి తహర్' (కొండ మేకలు) కు ప్రధాన నిలయం. కేరళలో 1978లో స్థాపించిన మొదటి జాతీయ పార్కు ఇదే కాగా, పశ్చిమ కనుమలలోని ఈ పార్కులో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన ఆనముడి శిఖరం ఉంది.

సంబంధిత పోస్ట్