వినాయక నిమజ్జనంలో ఎస్సై హంగామా

జగిత్యాలలోని వాణినగర్‌లో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో పడాల రాజేశ్వర్ అనే ఎస్ఐ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. మహిళలు నిమజ్జన వేడుకలను వీక్షిస్తుండగా అక్కడికి కారులో వచ్చి హంగామా చేశాడు. రాజేశ్వర్‌ను స్థానికులు అడ్డుకోగా.. వారిపై రాయితో దాడికి యత్నించాడు. నేను ఎస్ఐని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడున్న యువకులను బెదిరించిన‌ట్లు స‌మాచారం

సంబంధిత పోస్ట్