క్యాన్సర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల ఇథియోపియా బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు తల్లిదండ్రులు 4 వేల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వచ్చారు. అయితే, విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు బాలిక ఆరోగ్యం విషమించి, విమానంలోనే మృతి చెందింది. స్వదేశానికి మృతదేహాన్ని తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేకపోవడంతో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. వైద్య సేవల కోసం సరిహద్దులు దాటి వచ్చే పేద కుటుంబాల నిస్సహాయతను ఈ ఘటన కళ్లకు కట్టింది.