ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడి భారత దౌత్య కార్యాలయం భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, దౌత్య కార్యాలయం అందిస్తున్న సహాయాన్ని నిరాకరించిన కొందరు విద్యార్థులు మాత్రమే టెహ్రాన్‌లో మిగిలిపోయారని పేర్కొంది.