భారత్‌-చైనా మధ్య ఒప్పందం కుదిరినా.. కొంత సమయం పడుతుంది: జై శంకర్‌

భారత్‌-చైనా మధ్య గస్తీ ఒప్పందం కుదిరినప్పటికీ విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి కొంత సమయం పడుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు. పుణెలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులతో శనివారం జై శంకర్ ముచ్చటించారు. ఇరుదేశాల మధ్య పరస్పర చర్చల వల్లే ఒప్పందం సాధ్యమైందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై భారత్‌ దృష్టిపెట్టడం, సైన్యాన్ని సమర్థంగా మోహరించడం కూడా ఒప్పందం దిశగా చైనా అడుగులు వేసేందుకు దోహదం చేశాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్