టాలీవుడ్ నటుడు బెనర్జీ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హీరో మెటీరియల్ అయినా, నటుడిగా కొనసాగడానికే ఇష్టపడ్డానని తెలిపారు. తండ్రి గొప్ప నటుడని, మురళీమోహన్ కూడా తాను హీరో కావాలని అన్నారని గుర్తు చేసుకున్నారు. అయితే, నటుడిని కావాలనే తపన, ఫైర్ తనలో ఎప్పుడూ లేదని, కేవలం సంతోషంగా ఉండాలనే కోరికతోనే కెరీర్ సాగిందని, వచ్చిన దాంతో సంతృప్తి చెందడమే దీనికి కారణమని బెనర్జీ పేర్కొన్నారు.