అమెరికాలో 'బర్త్ టూరిజం'పై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వచ్చి ప్రసవించి పౌరసత్వం పొందే ప్రయత్నాలను అడ్డుకోనుంది. జన్మనివ్వడం కోసమే టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌లో స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలను అనుమతించబోమని తెలిపింది.