దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ, ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. మరణాల ఆధారంగా ఆధార్ డీయాక్టివేషన్ ప్రక్రియలో లోపాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2025లో భారత జనాభా 146.39 కోట్లు కాగా, ఆధార్ కలిగినవారి సంఖ్య 142.39 కోట్లుగా ఉంది.